ఆర్టికల్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2014, శనివారం
9, ఏప్రిల్ 2012, సోమవారం
13, ఫిబ్రవరి 2012, సోమవారం
25, జనవరి 2012, బుధవారం
31, డిసెంబర్ 2011, శనివారం
14, నవంబర్ 2011, సోమవారం
6, మే 2011, శుక్రవారం
55 వసంతాల చింతామణి

‘మోహం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది’, ‘ఎవరి పిచ్చి వారికి ఆనందం’ అనే సత్యాలను ప్రతిబింబించే విధంగా నిర్మించిన భరణీ సంస్థ వారి మకుటాయమానమైన తెలుగు చిత్రరాజం ‘చింతామణి’ విడుదలై 55 వసంతాలను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 11వ తేదీ నాటికి ‘చింతామణి’ 56వ వసంతంలోకి అడుగిడింది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి ‘చింతామణి’గా అనన్యసామాన్య నటనను ప్రదర్శించిన చిత్రం చింతామణి. భానుమతి నటించిన 22వ చిత్రం ఇది. భానుమతి భర్త రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామకృష్ణ దర్శకత్వంలో ఎన్‌టిరామారావు తొలిసారిగా నటించిన చిత్రం ‘చింతామణి’. ఎన్టీరామారావు, భానుమతిలు కలిసి నటించిన ఎనిమిదవ చిత్రం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ‘కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత’ అన్నట్టుగా చౌకబారు సంభాషణలతో, అసభ్య ఆంగిక వాచకాలతో చింతామణి నాటకాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే 1956 ప్రాంతంలో నిర్మించబడిన భరణీవారి ‘చింతామణి’ చిత్రం ఎంతో ఉదాత్తంగా , హృద్యంగా చిత్రీకరించబడింది. చింతామణి పాత్రను భానుమతిని దృష్టిలో పెట్టుకుని భక్తురాలిగా మారిన పరిణతి చెందిన వేశ్యగా ఉదాత్తంగా చిత్రీకరించారు. ఎన్టీరామారావు (బిళ్వమంగళుడు), జమున (రాధ), ఎస్‌విరంగారావు (్భవానీ శంకరుడు), రేలంగి వెంకట్రామయ్య (సుబ్బిశెట్టి), రఘురామయ్య (శ్రీకృష్ణుడు), వి.కామరాజు (వాసుదేవమూర్తి), దేవి (చిత్ర), ఎ.నారాయరావు (దామోదరుడు), ఛాయాదేవి (మణి), ఋష్యేంద్రమణి (శ్రీహరి) ప్రభృతులు తమ అసమాన నటనా ప్రతిభతో రక్తికట్టించారు. టివిరాజు నేపథ్య సంగీతాన్ని, అద్దేపల్లిరామారావు సంగీతాన్ని అందించగా భానుమతి సంగీత పర్యవేక్షణ వహించారు. రావూరి వెంకట సత్యనారాయణరావు గీతరచన చేయగా శ్రీ్ధర్ ఛాయాగ్రహణం నిర్వహించిన ఈ చిత్రానికి నిర్మాత, దర్శకత్వ బాధ్యతలను పి.రామకృష్ణ చేపట్టారు. 11 ఏప్రిల్ 1956న విడుదలైన ‘చింతామణి’ చిత్రం 55 వసంతాలను పూర్తి చేసుకున్న ఓ కళాఖండం.
ఈ సినిమాలోని అద్భుతమైన రావోయి రావోయి ఓ మాధవా పాట కింద చూడండి.
14, మార్చి 2011, సోమవారం
షష్ఠి పూర్తి ముంగిట్లో మల్లీశ్వరి

1951లో ఎన్.టి.రామారావు,భానుమతి నటించిన ‘మల్లీశ్వరి’ (డిసెంబర్ 20) విభిన్న కోణాల్లో చిరస్మరణీయమైన ఆణిముత్యంగా నిలిచిపోయింది. అరవై ఏళ్ల కిందట విడుదలైనా నేటికీ రసజ్ఞ ప్రేక్షక లోకానికి తీయని అనుభూతులు అందిస్తూనే ఉంది. క్లాసిక్స్ అన్న మాటకు నిర్వచనం మల్లీశ్వరి.
వాహిని వారి చిత్రం ‘మల్లీశ్వరి’.ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు బి.ఎన్.రెడ్డి.
మల్లీశ్వరి చిత్రానికి మాటలు, పాటలు రాసి సినీ రంగ ప్రవేశం చేసారు దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, సంగీతాన్ని సాలూరు రాజేశ్వరరావు అందించగా సహకరించారు అద్దేపల్లి రామారావు. కెమెరా ఆది యం.ఇరాని, బి.ఎన్.కొండారెడ్డి.
చారిత్రక నేపథ్యం కల ‘మల్లీశ్వరి’ చిత్రానికి రాయలనాటి కాలం గుర్తుకు వచ్చేలా సెట్టింగ్స్ రూపొందించారు ఎ.కె.శేఖర్.
మల్లీశ్వరి చిత్రానికి బుచ్చిబాబు రాసిన రేడియో నాటిక ‘రాయలవారి కరుణకృత్యం’, ఇలస్టేటెడ్ వీక్లీలోని మరో కధ.
కథా కథనాలు:
వీరాపురంలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ. ఆ కుటుంబాలకు చెందిన అన్నా చెల్లెళ్ల పిల్లలు నాగరాజు, మల్లీశ్వరి. బావ మరదళ్లు చిన్నతనంనుంచి అన్యోన్యంగా పెరిగారు.
ఓరోజు సంతకు వెళ్లి తిరిగి వస్తూ వర్షంవల్ల ఓ సత్రంలో తలదాచుకుంటారు. మల్లీశ్వరి జావళి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు. మారువేషంలో అదే సత్రంలో ఆగిన శ్రీకృష్ణదేవరాయలు, వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ నృత్యాన్ని చూసి ఆనందపడతారు. తెలియక అమాయకత్వంతో వారిని విజయనగరంనుంచి రాణివాసం పల్లకి పంపమని కోరతాడు నాగరాజు.
మల్లీశ్వరి తల్లికి డబ్బు ఆశ ఎక్కువ. అది సంపాదించడం కోసం నాగరాజు ఊరువిడిచి వెడతాడు. ఈలోగా పల్లకి వచ్చి మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లిపోతుంది. తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు. ఒకనాడు మంటప నిర్మాణం చూడడానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది. మరునాడు వారిరువురు నదీ తీరాన కలుస్తారు. అక్కడనుంచి ఆ మరునాడు తప్పించుకుని వెడదామని అనుకుంటారు. ఎంతకూ రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును, మల్లీశ్వరి బంధిస్తారు సైనికులు.
అందుకై మరణశిక్ష పడవలసి వున్నా, రాయలవారు పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో ప్రేమకథ సుఖాంతమవుతుంది.
నటీనటులు:
ఈ చిత్రంలో కథానాయకుడు రామావు. విషాద భావ ప్రకటనకు అవకాశం ఎక్కువ. ఈ పాత్ర సానబట్టిన వజ్రంగా ఎన్టీఆర్‌ను మలిచింది. మల్లీశ్వరి నాయిక భానుమతి ఎన్నో షేడ్స్ కూడిన పాత్రకు తన గానం, అభినయంతో ప్రాణం పోసారు.
మల్లీశ్వరిలో, మల్లీశ్వరి ఇష్ట సఖిగా నాగరాజు, మల్లీశ్వరిని కలిపే ప్రయత్నంలో ‘ఝుం, ఝుం, ఝుం తుమ్మెదా’ అంటూ నటిస్తూ, గానం చేసారు. తొలి తెలుగు కథానాయిక సురభి కమలాబాయి పాతాళ భైరవిలో తోటరాముని తల్లిగాను, మల్లీశ్వరిలో పొరుగింటి ఇల్లాలు ‘బసక్క’గాను నటించారు.
సంగీత సాహిత్యాలు:
మల్లీశ్వరి మాటలు పాత్రోచితంగా గంభీరంగా ఉంటాయి. మల్లీశ్వరి చిత్రంలో సినీ గీతాలకు కావ్య గౌరవం లభించిందని ప్రశంసించారు తాపీ ధర్మారావు. చిత్ర గీతాలన్నీ రసజ్ఞ శ్రోతల హృదయాలను అలరిస్తున్నాయి. ‘కోతి బావకుపెళ్లంట’, ‘పరుగులు తీయాలి’, ‘పిలిచిన బిగువటరా’, ‘మనసు తెలిసిన మేఘమాలా’,‘ఔనా నిజమేనా’, ‘ఎందుకే నీకింత తొందర‘, ‘నెలరాజా’ ఇవన్నీ ఒక ఎత్తు, ‘మనసున మల్లెల మాలలూగెనే’ మరో ఎత్తు. ఆ గీతాలు ఉదాత్త రచనతో సముదాత్త సంగీతంతో ఘంటసాల, భానుమతి గానంతో చిరంజీవులైనాయి.
ఈ చిత్రానికి పనిచేసిన వారిలో చాలామంది కీర్తిశేషులు కాగా ఇందులో నటించిన టి.జి.కమలాదేవి చెన్నైలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.
5, ఆగస్టు 2010, గురువారం
బహుముఖ ప్రజ్ఞకు మరో పేరు భానుమతి!
భానుమతి పేరు వినగానే ఆమె బహుముఖ ప్రజ్ఞ ముందుగా మన స్మృతిపథంలో మెదలుతుంది. నటిగా, రచయిత్రిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, కథకురాలిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా... ఇలా పలు విధాలా తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన మరోనటిని మన భరతభూమిలో చూడబోము. అహంభావాన్ని కూడా అందంగా ప్రదర్శించే నేర్పు భానుమతి సొంతం! అందుకు ఆమె బహుముఖప్రజ్ఞ కంచుకవచంలా నిలచి ఆ అందానికి మరిన్ని మెరుగులు దిద్దుతూ ఉంటుంది. అదే ఆమెను అందరిలోకి మిన్నగా నిలిపింది.
భానుమతికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు రావాలని ఆమె అభిమానులు అభిలషించవచ్చు. దాదా సాహెబ్ ఫాల్కే వంటి అవార్డును ఆమెకు ప్రదానం చేయలేదని చింతిల్లనూ వచ్చు. ఆమెలోని బహుముఖప్రజ్ఞాపాటవాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించితీరాలి. మరి ఒక్క ఫాల్కేనే ఇస్తే ఎలా!? ఆ స్థాయి ఉన్న అవార్డులు ఎన్నో ఆమెను చేరాలి. ఆమెకు లభించిన అవార్డులన్నీ ఆమె ప్రతిభాపాటవాలను చూసి మురిసిపోయి పరుగులు తీస్తూ వచ్చి వడిలో వాలినవే తప్ప ఏనాడూ ఆమె అర్రులు చాచి అవార్డులకై పాకులాడింది లేదు. అలా అయితే ఆమె భానుమతి ఎందుకవుతుంది!? ఏ కళాకారులకైనా ప్రజల మన్ననలను మించిన అవార్డులేముంటాయి. భానుమతిలోని ప్రతి కళకు జనం నీరాజనాలు పట్టారు. అంతకంటే ఏం కావాలి? అందుకే ఆమెకు ఏదైనా అవార్డు నిస్తే 'ఈ అవార్డు ఆమెకు ఎప్పుడో రావలసింది' అని ఇచ్చేవారే నొచ్చుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. బహుశా ఫాల్కే అవార్డు విషయంలో కూడా నిర్ణేతలు ఇలాగే భావించారేమో! ఆమె అభిమానులు ఆశించినన్ని అవార్డులు రివార్డులు రాకున్నా భానుమతి ప్రజ్ఞాపాటవాలే ఆమెకు ఎనలేని గౌరవాన్ని ప్రేక్షక హృదయాలలో సంపాదించి పెడుతున్నాయి. అంతకంటే ఓ కళాకారిణికి ఏం కావాలి!?
1924 సెప్టెంబర్ 7న (భానుమతి స్వయంగా 'పెళ్ళికానుక' షూటింగ్ సమయంలో చెప్పిన తేదీ) భానుమతి ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా దొడ్డవరం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య. సంప్రదాయ కుటుంబం కావడం వల్ల బొమ్మరాజువారు తన కూతురుకు చిన్నతనంలోనే భాషాపాండిత్యాన్ని, లలితకళలను అభ్యసింప చేశారు. చిరుతప్రాయంలోనే భానుమతి రామాయణ, భారతాల్లోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించేవారు. అలాగే చిన్నతనంలోనే రచనలు చేసి, తన తండ్రి స్నేహితులైన మేటి పండితులను అబ్బుర పరిచారు. నాట్యంలోనూ అతి తక్కువ సమయంలో ప్రావీణ్యం సంపాదించారు. సుబ్బయ్య కూతురి ప్రతిభాపాటవాలను చూసి ఇరుగు పొరుగువారు సైతం మురిసిపోయేవారు.
పదమూడేళ్ళ ప్రాయానికే భానుమతి తన అందచందాలతో యువకుల మతులు పోగొట్టేది, ఆ సమయంలోనే తన ప్రతిభాపాటవాలతో పండితుల ప్రశంసలూ అందుకునేది. ఆమె గురించి ఆ నోటా, ఈ నోటా విని సి.పుల్లయ్య తన దర్శకత్వం లో రూపొం దిన 'వరవిక్రయం' (1939) చిత్రం ద్వారా భానుమతిని సినిమా రం గానికి పరిచ యం చే శారు. సు బ్బయ్య మ రీ ఛాందసులు కావడంతో తన కూ తురుపై చిత్రీకరించే ప్రేమ సన్నివేశాల్లో కౌగిలింతలు ఉండరాదని షరతు పెట్టేవారు. అందుకు అంగీకరించిన వారి చిత్రాల్లోనే భానుమతిని నటింప చేసేవారు. అదే భానుమతికి అలవాటయింది. అందుకే ఆ తరువాతి కాలంలో కూడా భానుమతిని కౌగిలించుకోవడానికి హీరోలు సంశయించేవారు. అయితే పాత్రకు అనుగుణంగా నటించడానికి తన సహ నటీనటులను హుషారు పరచడంలోనూ ఆమె ముందుండేవారు.
తనకు మర్యాద లభించకుంటే ఎంతటివారినైనా ఆమె లెక్క చేసేది కాదు. ఆ రోజుల్లో కొందరు దర్శకులు తామే అందరికంటే మిన్న అన్న భావనతో హీరోయిన్లను చులకనగా 'ఒసేయ్, ఏమే...' అంటూ పిలిచేవారు. ఓ తమిళచిత్రం షూటింగ్‌లో దర్శకుడు భానుమతిని అలాగే "ఏమిటే... డైలాగ్ చూసుకున్నావా!?'' అన్నాడు. అంతే ఆత్మాభిమానం మెండుగా ఉన్న భానుమతి, "ఏమిట్రా... డైలాగు చూసుకునేది?'' అని అనేసరికి, సదరు దర్శకునికి, చుట్టు పక్కల ఉన్నవారికి మతిపోయింది. అప్పటి నుంచీ ఆమె అంటే చాలామందికి హడల్. అయితే తనను గౌరవించేవారిని, ఆమె కూడా ఎంతో గౌరవించేవారు. దటీజ్ భానుమతి అని నాటి సినీప్రముఖులే ఆమెను ఎంతో గౌరవించేవారు. ఆమె వ్యక్తిత్వం భిన్నమైనది. తన ప్రతిభాపాటవాలతోనే తన జీవితాన్ని నిర్మించుకున్న భానుమతి పెళ్ళి విషయంలోనూ ఆ రోజుల్లోనే తన మనసుకు నచ్చినవాణ్ణే మరీ వరించింది. నాటి అసిస్టెంట్ డైరెక్టర్ పి. రామకృష్ణను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. తరువాత దర్శకునిగా రామకృష్ణ, నిర్మాతగా ఆమె తమ 'భరణీ స్టూడియోస్' ద్వారా పలు చిత్రాలను రూపొందించారు.
నటిగా...
తొలి చిత్రం 'వరవిక్రయం'లోనే నటిగా తన ప్రతిభను చాటుకున్నారామె. 'కృష్ణమ్మ' చిత్రం షూటింగ్ సమయంలోనే రామకృష్ణను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నా, బి.యన్. రెడ్డి ప్రోద్బలంతో, భర్త ప్రోత్సాహంతో ఆమె 'స్వర్గసీమ'లో నటించారు. ఇందులో ఆమె పోషించింది వాంప్ పాత్రే అయినా, ఎక్కువ మార్కులు సంపాదించుకోగలిగింది. ఆ తరువాత "మల్లీశ్వరి, లైలామజ్నూ, చండీరాణి, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, అంతస్తులు, అగ్గిరాముడు, వివాహబంధం, తోడు-నీడ, గృహలక్ష్మి, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే'' తదితర చిత్రాలలో అనితర సాధ్యమైన అభినయాన్ని ప్రదర్శించారు. చాలా ఏళ్ళ తరువాత 1984లో కోడి రామకృష్ణ, 'భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్' గోపాల రెడ్డి అభిలాష మేరకు 'మంగమ్మగారి మనవడు' చిత్రంలో మంగమ్మ పాత్రను పోషించారు. ఆ తరువాత "అత్తగారూ స్వాగతం, ముద్దుల మనవరాలు, సమ్రాట్ అశోక, మొరటోడు నా మొగుడు, బామ్మమాట బంగారుబాట, పెద్దరికం, పెళ్ళికానుక'' వంటి చిత్రాల్లో నటించారు. ఏ పాత్ర పోషించినా, అందులో తనదైన పంథాను ప్రవేశపెట్టి అభినయించి, తనకు తానే సాటి అనిపించుకోవడం ఆమెకే చెల్లింది.
నిర్మాతగా...
భానుమతి తరంలో మేటి హీరోలయిన యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ వీరి 'భరణీ సంస్థ'లో నటించారు. ఏయన్నార్ ఈ సంస్థ పర్మినెంట్ హీరో. ఆయన హీరోగా "రత్నమాల, లైలా మజ్నూ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి'' వంటి చిత్రాలను నిర్మించారామె. యన్.టి.రామారావు హీరోగా "చండీరాణి, వివాహబంధం, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలను రూపొందించారు. ఈ ఇద్దరు హీరోలతో ఆమె సొంత చిత్రాలలోనే కాకుండా ఇతర చిత్రాల్లోనూ నటించారు. ఆ తరువాత 'అంతా మనమంచికే' వంటి చిత్రాలనూ ఆమె నిర్మించారు. 1955లో ఆమె నిర్మించిన 'విప్రనారాయణ' చిత్రానికి జాతీయ అవార్డు లభించింది.
దర్శకురాలిగా...
భానుమతి తన స్వీయదర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం 'చండీరాణి' (1953). ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తూనే దర్శకత్వం, నిర్మాణం, సంగీత పర్యవేక్షణ వంటి బాధ్యతలనూ నిర్వహించారు. అదీగాక ఈసినిమాను హిందీ, తమిళ భాషల్లో కూడా నిర్మించి, మూడు చిత్రాలను ఒకేసారి విడుదల చేశారు. బహుశా ఈ రికార్డు మరే నటికి ఇప్పటి వరకు సాధ్యం కాలేదనే చెప్పాలి. తరువాత ఆమె దర్శకత్వంలో 'అమ్మాయి పెళ్ళి, అంతామనమంచికే, భక్త ధ్రువ మార్కండేయ' వంటి చిత్రాలూ రూపొందాయి. తన దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా చిత్రాలను నిర్మించిన భానుమతి తరువాత ఆయన దర్శకత్వంలో 'తాతమ్మకల', 'సమ్రాట్ అశోక'లో నటించారు.
గాయనిగా...
తన పాటలను తానే పాడుకొనే భానుమతి పదమూడేళ్ళ ప్రాయంలో ఏలాంటి మాధుర్యాన్ని పలికించారో, ఏడు పదులు దాటిన వయసులోనూ అదే మాధుర్యాన్ని తన గళంలో పలికించగలిగారు. 'స్వర్గసీమ'లో ఆమె పాడిన "ఓహో హో హో పావురమా...'' పాట ఆ చిత్రవిజయానికి ఎంతగానో తోడ్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇక పాటల పందిరిగా రూపొందిన 'మల్లీశ్వరి'లో ఆమె గాత్రంలో జాలువారిన ప్రతి పాటా అమృతమయమేనని నేడు కొత్తగ చెప్పవలసిన పనిలేదు. "సావిరహే తవ...'' (విప్రనారాయణ), "విరితావులలో...'' (లైలా మజ్నూ), "నీ వాలు కనులలో...'' (తెనాలి రామకృష్ణ), "శ్రీకర కరుణాలవాల...'' (బొబ్బిలి యుద్ధం), "రానీ రాజు రానీ...'', "ఎవరు రా నీవెవరురా...'' (అగ్గిరాముడు), "చరణం నీ దివ్య శరణం...'' (మట్టిలో మాణిక్యం), "నేనే రాధనోయి...'' (అంతా మనమంచికే), " ఎవరు కన్నారు ఎవరు కలగన్నారు...'' (తాతమ్మకల), "శ్రీరఘురామా... సీతారామా...'', "శ్రీ సూర్యనారాయణా మేలుకో...'' (మంగమ్మగారి మనవడు) వంటి పాటల్లో ఆమె గాత్రం నేటికీ వీనులవిందు చేస్తుంది.
రచయిత్రిగా...
"చండీరాణి, అంతా మనమంచికే, అమ్మాయి పెళ్ళి'' వంటి చిత్రాలకు ఆమె కథ సమకూర్చారు. కొన్ని చిత్రాలకు రచన చేయడంలో పాలుపంచుకున్నారు. ఆమె రాసిన "నాలో నేను'', "అత్తగారి కథలు'' తెలుగు పాఠకులను ఎంతగానో అలరించాయి.
జ్యోతిషంలోనూ...
సంగీత సాహిత్యాల్లోనే కాకుండా, చిత్రలేఖనం, జ్యోతిషంలో కూడా ఆమెకు ప్రవేశముండేది. మోడరన్ థియేటర్స్ పతాకంపై టి.ఆర్. సుందరం నిర్మించిన 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు యమ్.జి.రామచంద్రన్, ఈమెను చూసి బెరుగ్గా ఉన్న సమయంలో ఆయన బెరుకు పోగొట్టేందుకు భానుమతి చనువుగా ఆయన చేయి తీసుకొని, తనకు తెలిసిన జోస్యం చెప్పారు. ఆ సమయంలో "ఏనాటికైనా నీవు రాజ్యాలేలే రోజుంది...'' అని భానుమతి, రామచంద్రన్‌తో అన్నారు. ఆ తరువాత అది అక్షరసత్యమైందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఆమె బహుముఖ ప్రజ్ఞ అన్ని విధాలా విజయం సాధించింది. కాబట్టి, ఆమెకున్న ప్రతి కళలోనూ ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు ఆమెను వరించి తీరాల్సిందే. అయితే ఆ ప్రజ్ఞాశాలి వడిని చేరే అదృష్టం అన్ని అవార్డులకూ ఉండొద్దూ!
అయితే కొన్ని అవార్డుల మాత్రం ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. అలాంటి వాటిలో 'పద్మశ్రీ', 'కలైమామణి', 'యన్టీఆర్ జాతీయ అవార్డు' వంటివి ఉన్నాయి. ఏదేమైనా విలక్షణ వ్యక్తిత్వంతో వి'చిత్ర'రంగంలో సలక్షణంగా తనకు తానే సాటి అనిపించుకున్న భానుమతి తెలుగుప్రజల హృదయ సామ్రాజ్యంలో మకుటంలేని మహారాజ్ఞిగా నిత్యాభిషేకాలు జరుపుకుంటూనే ఉంటారన్నది జగమెరిగిన సత్యం! తెలుగు సినిమా చరిత్రలో భానుమతి అధ్యాయానికి సాటిరాగలది మరొకటి ఉదయిస్తుందన్న నమ్మకం ఏ తెలుగువాడికీ ఉండదని బల్ల గుద్ది చెప్పవచ్చు.
------------------ఈ ఆర్టికల్ ఆంధ్రజ్యోతి నుండి గ్రహించడమైనది---------------------

2, జూన్ 2010, బుధవారం
కారణజన్మురాలు 'భానుమతి'
భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో భానుమతి రామకృష్ణ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లి కి చేసిన సేవలు అజరామరం.
భానుమతి పేరు వినగానే 'మల్లీశ్వరి', 'లైలా మజ్ఞు', 'విప్రనారాయణ', 'స్వర్గసీమ', 'బాటసారి' వంటి అద్భుత చిత్రాలు మన మదిలో మెదిలుతాయి. ఈ చిత్రాల్లో ఆమె నటన అజరామరం. 1925, సెపెంబరు 7న ఒంగోలులో భానుమతి గారు జన్మంచారు. సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం లేని భానుమతి అనుకోకుండా 'పరవిక్రయం' సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేసారు. 1943లో 'కృష్ణ ప్రేమ' చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న రామకృష్ణను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1946లో ప్రముఖ దర్శకుడు శ్రీ బియన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'స్వర్గసీమ' చిత్రంలో ఆమె నటన ఓ అద్భుతం. ఈ చిత్రంలో ఆమె పాడిన ''ఓహో ఓహో పావురమా" పాట ఆమె చిరునామా అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
1947లో తన కుమారుడి పేరిట 'భరణి పిక్చర్స్' ప్రారంభించి తొలి ప్రయత్నంగా తన భర్త రామకృష్ణ దర్శకత్వంలో 'రత్నమాల' అనే చిత్రాన్ని నిర్మించారు. 1953లో దర్శకురాలిగా మారి ఒకే సారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'చండీరాణి' అనే చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించారు. అంతే కాకుండా టైటిల్ రోల్ ఆమే పోషించడం అప్పట్లో ఓ సంచలనం. ఆమె ఎంత గొప్పనటో అంతే గొప్పగాయని. "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" అంటూ ఆమె స్వరం నుండీ జాలువారిన పాటలు నేటికీ అజరామరంగా నిలిచాయి.
తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన భానుమతి అందుకున్న గౌరవాలు, అవార్డులు అనేకం. 1966లో "పల్నాటి యుద్ధం", "అంతస్తులు" చిత్రాలకు గాను జాతీయ అవార్డును, 1964లో కళైమణి అవార్డుని, 1966లో కేంద్రప్రభుత్వ "పద్మశ్రీ", 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రఘుపతి వెంకయ్య అవార్డుని, 2001లో "పద్మ భూషన్", "ఎన్టీఆర్ జాతీయ అవార్డు"ని...ఇలా ఎన్నో అవార్డులు పొంది సినీసీమను సుసంపన్నం చేసారు. భానుమతి గారిది ఓ విలక్షణమైన మనస్తత్వం. వింతైన ఆలోచనాధోరణి, రాళ్లను సైతం కరిగించగల స్వరం ఆమె సొంతం. అలాంటి కారణ జన్మురాలిని ఓ సారి స్మరించుకోవడం మన కనీసధర్మం.
---------ఈ ఆర్టికల్ థట్స్ తెలుగు నుండి గ్రహించడమైనది.-------------------

5, మే 2010, బుధవారం
నటనకు సారమతి భానుమతి
మనసున మల్లెల మాలలూగెనే పాట వినిపించగానే ఆ పాటకు భానుమతి ఆలాపన నటించిన తీరు ఇప్పటికి రసహృదయాలను పులకింప చేస్తుంది. మల్లీశ్వరి కోసం కృష్ణశాస్త్రి భానుమతిని దృష్టిలో పెట్టుకొని రాసారా, భానుమతిని కళ్లముందు నిలుపుకుని సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారా అని అనిపించక మానదు. చిన్నతనం నుండి తండ్రి గారాలపట్టిగా పెరిగిన భానుమతి సంస్కృతం భాగా నేర్పించడంవల్లను సాహిత్యం మీద ఆసక్తి పెంచుకోవడం వల్లను ఆమె మనస్సులో అవి చెరుగని మద్ర వేశాయి.
తను పోషించే పాత్రలకు ఆలపించే గానంకి ప్రాణం పోయగలిగే నేర్పు అలబడింది. ఇదే క్రమ క్రమంగా రచన, సంగీతం, చిత్రకళ, నాట్యకళ, ఇలా వివిధ కళలను ఔపోసన పట్టిన భహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడానికి ఆస్కారం ఏర్పడింది. తొలుత నటి కావడానికి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. పాడడానికి మాత్రం ఎప్పుడు సిద్దమే. అయినా తొలిసారి పాటలేకపోవడం వల్ల సినిమా ఛాన్స్ గోడవల్లి రామబ్రహ్మం వద్ద మిస్ కావడం ఎంతో ఆనందం కలిగించింది ఆమెకు. కాలింది పాత్రకు భానుమతిని పుల్లయ్య గారు ఎంపిక చేసినప్పుడు బలిజెపల్లి గొప్ప రచయిత్రిగా, గాయనిగా , నటిగా కీర్తిప్రతిష్టలు గడించాలని ఆశ్వీర్వదించారు. ఆయన ఆశీర్వాద బలమో ఏమో గాని వర విక్రయం, మాలతి మాధవ , ధర్మపత్ని, భక్తిమాల ఇలా చిత్ర చిత్రానికి భానుమతి నటనకు గానానికి పేరు వచ్చింది. ఛండిరాణి, లైలామజ్ను, విప్రనారాయణ, బాటసారి ఇలా ప్రతి చిత్రంలోను ఆమె నటనకు గానానికి జోహారు అన్నారు ప్రేక్షకులు. తమిళ ప్రేక్షకులు భానుమతి, తమ ఆడపడుచు అని భావించేంత పేరు తెచ్చుకోవడం వలన తమిళనాడు నుండి ఎక్కువ అవార్డులు పొందే అవకాశం లభించింది భానుమతి రామకృష్ణ.

31, మార్చి 2010, బుధవారం
బహుముఖ ప్రతిభాశాలి భానుమతి

1925 లో సెప్టెంబర్ 7 వ తేదీన, ప్రకాశం జిల్లాలోని దొడ్డవరం గ్రామంలో, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దపతులకు జన్మించిన ఆణిముత్యమే ఈ బహుముఖ ప్రతిభాశాలి భానుమతి. భానుమతి నటి, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, దర్శకురాలు, నిర్మాత, స్టుడియో అధినేత్రి ఇలా అనేక రంగాల్లో సంచలనాలు స్రుష్టించిన తొలి తెలుగు మహిళ భానుమతి.తండ్రి వెంకట సుబ్బయ్య శాస్త్రీయ సంగీత ప్రియుడు, రంగస్థల నటుడు కావటంతో భానుమతికి ఆయనే తొలి గురువు,నటనలో స్ఫూర్తి కూడా. ఆయనే ఆమెకు శాస్త్రీయ సంగీతాన్ని దగ్గరుండి నేర్పించారు. ఆ తర్వాత 1935 లో , పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన "వరవిక్రయం" చిత్రంలో భానుమతి తొలిసారిగా నటిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు. తర్వాత మాలతీ మాధవం, ధర్మపత్ని, భక్తిమాల, క్రిష్ణప్రేమ, స్వర్గసీమ, చక్రపాణి, లైలామజ్ఞు, విప్రనారాయణ, మల్లీశ్వరి, బాటసారి, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అగ్గిరాముడు, తెనాలి రామక్రిష్ణ, అంతస్తులు, మట్టిలో మాణిక్యం, అంతా మనమంచికే, అమ్మాయిపెళ్ళి, మంగమ్మగారి మనవడు వంటి రెండు వందల చిత్రాల్లో ఆమె నటించారు. భానుమతి నటించిన చివరి చిత్రం "పెళ్ళికానుక". .ఆమె సీన్ లో ఉంటే మరో నటి గానీ, నటుడు గానీ కనపడడనే వినికిడి సినీ పరిశ్రమలో ఉండేది. అందుకే ఆనాటి సినీ పరిశ్రమలో భానుమతికి "అష్టవర్థిని"అనే బిరుదుండేది. ఇక గాయనిగా ఆమె పాడిన పాటలు వందల్లో ప్రేక్షకులను అలరించాయి.
భానుమతి గారికి లభించిన గౌరవం కానీ, సన్మానాలు కానీ, అవార్డులూ, రివార్డులూ మరే తెలుగు నటికీ లభించలేదంటే అతిశయోక్తికాదు.పల్నాటి యుద్ధం చిత్రానికి గాను 1966 లో జాతీయ ఉత్తమనటిగా, అన్నై అనే తమిళ చిత్రానికి కూడా ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు, 1965 లో అంతస్తులు చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా లభించగా, 1966లో భారత ప్రభుత్వం "పద్మశ్రీ" అవార్డుతో గౌరవించగా,1975 లో ఆంధ్రా యూనివర్సిటీ, 1984 లో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు అందించి గౌరవించాయి. 1983 లో తమిళనాడు ప్రభుత్వం "కళాఈమామణి" బిరుదునిచ్చి గౌరవించింది. 1986 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "రఘుపతివెంకయ్య నాయుడు "అవార్డుని భానుమతి గారికిచ్చి గౌరవించింది. 2000 సంవత్సరంలో యన్.టి.ఆర్.నేషనల్ అవార్డునిచ్చి గౌరవించగా, 2003 లో ఆమెకు భారత ప్రభుత్వం "పద్మభూషణ్ "అవార్డునిచ్చి గౌరవించింది.అటువంటి బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్ భానుమతీ రామక్రిష్ణ 2005లో డిసెంబర్ 24 వ తేదీన పరమపదించారు. ఒక బ్రుహత్తార నేలరాలి, ఆకాశంలో ధ్రువతారగా నిలిచిపోయింది. తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం భానుమతికి చావులేదు. ఆమె అమరజీవి. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.
-------------ఈ ఆర్టికల్ మాస్టార్స్ డాట్ కాం నుండి గ్రహించడమైనది.---------------
15, ఫిబ్రవరి 2010, సోమవారం
7, మే 2009, గురువారం
30, ఏప్రిల్ 2009, గురువారం
21, ఏప్రిల్ 2009, మంగళవారం
12, మార్చి 2009, గురువారం
భానుమతి గారి గురించి తనికెళ్ళ భరణి
ఆమెకూ సినిమాకూ 70 ఏళ్ల అనుబంధం..! చిన్న వయసులోనే వెండితెరపై వెలిగిపోయిందామె. నటన, గాత్రం, రచన, దర్శకత్వం.. సినిమా నిర్మాణం.. ఇలా ఒక్క రంగం కాదు.. ఒక విభాగమని కాదు.. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. తెలుగునాటే కాదు.. తమిళనాడులోనూ ఆదరణ పొందింది. ఓ మధ్యతరగతి మహిళ ఇన్ని రంగాల్లో విజయబావుటాలు రెపరెపలాడించిందంటే ఎంత ధైర్యం కావాలి. ఎంత తెగువ కావాలి.. ఎన్ని కష్టాలకోర్చాలి.? అందుకే ఓ సందర్భంలో ఆమె నాకు రాళ్లూపూలూ రెండూ కొత్త కాదని గట్టిగా చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించిన నటి… ధీశాలి భానుమతి. తెలుగు చిత్రసీమ భాగ్యమతి! ఆమె బహుముఖ ప్రజ్ఞ… నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాటల్లో…
దిషణాహంకారం - నీకలంకారం
నీ పలుకుల నిండా కొరివికారం
కోపం నీకు వజ్రాల ముక్కుపుడక
సంగీత సాహిత్యాలు నీ చెవులకి లోలకులు
నీ చూపు చురకత్తి- నీ నవ్వు పూలగుత్తి
నువ్వు ఒక మతివి కావు శతమతివి
చిత్రసీమకు నువ్వో భారమితివి
కథానాయికల మార్గంలో నువ్వొక నూతన గతివి
నువ్వు భద్రకాళిలా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగిగోవువి
నువ్వు ఆడ హీరోవి!!
నువ్వు సంగీతం సంగతుల్లో పక్కా శృతివి
నటనలో మాత్రం అప్పుడప్పుడూ కొంచెం అతివి
ఇవాళ నువ్వో స్మృతివి
కానీ సినీ వినీలాకాశంలో
నువ్వు అస్తమయంలేని
‘భాను’మతివి-
(కురియు మా కన్నీరు గుండెలో దాచుకొని ఆమె ఆత్మను తడిపి రావా…)
మూలం: ఒరిజినల్ పోస్ట్ ఇక్కడ చూడండి
credit goes to: చంద్రశేఖర్ వల్లభనేని గారు

10, జనవరి 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)