చిత్రమాలిక

5, మే 2010, బుధవారం

నటనకు సారమతి భానుమతి

మనసున మల్లెల మాలలూగెనే పాట వినిపించగానే ఆ పాటకు భానుమతి ఆలాపన నటించిన తీరు ఇప్పటికి రసహృదయాలను పులకింప చేస్తుంది. మల్లీశ్వరి కోసం కృష్ణశాస్త్రి భానుమతిని దృష్టిలో పెట్టుకొని రాసారా, భానుమతిని కళ్లముందు నిలుపుకుని సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారా అని అనిపించక మానదు. చిన్నతనం నుండి తండ్రి గారాలపట్టిగా పెరిగిన భానుమతి సంస్కృతం భాగా నేర్పించడంవల్లను సాహిత్యం మీద ఆసక్తి పెంచుకోవడం వల్లను ఆమె మనస్సులో అవి చెరుగని మద్ర వేశాయి.

తను పోషించే పాత్రలకు ఆలపించే గానంకి ప్రాణం పోయగలిగే నేర్పు అలబడింది. ఇదే క్రమ క్రమంగా రచన, సంగీతం, చిత్రకళ, నాట్యకళ, ఇలా వివిధ కళలను ఔపోసన పట్టిన భహుముఖ ప్రజ్ఞాశాలిగా రూపొందడానికి ఆస్కారం ఏర్పడింది. తొలుత నటి కావడానికి ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు. పాడడానికి మాత్రం ఎప్పుడు సిద్దమే. అయినా తొలిసారి పాటలేకపోవడం వల్ల సినిమా ఛాన్స్‌ గోడవల్లి రామబ్రహ్మం వద్ద మిస్‌ కావడం ఎంతో ఆనందం కలిగించింది ఆమెకు. కాలింది పాత్రకు భానుమతిని పుల్లయ్య గారు ఎంపిక చేసినప్పుడు బలిజెపల్లి గొప్ప రచయిత్రిగా, గాయనిగా , నటిగా కీర్తిప్రతిష్టలు గడించాలని ఆశ్వీర్వదించారు. ఆయన ఆశీర్వాద బలమో ఏమో గాని వర విక్రయం, మాలతి మాధవ , ధర్మపత్ని, భక్తిమాల ఇలా చిత్ర చిత్రానికి భానుమతి నటనకు గానానికి పేరు వచ్చింది. ఛండిరాణి, లైలామజ్ను, విప్రనారాయణ, బాటసారి ఇలా ప్రతి చిత్రంలోను ఆమె నటనకు గానానికి జోహారు అన్నారు ప్రేక్షకులు. తమిళ ప్రేక్షకులు భానుమతి, తమ ఆడపడుచు అని భావించేంత పేరు తెచ్చుకోవడం వలన తమిళనాడు నుండి ఎక్కువ అవార్డులు పొందే అవకాశం లభించింది భానుమతి రామకృష్ణ.

3 కామెంట్‌లు:

  1. అంతే కాకుండా విప్రనారాయణలో "సావిరహే తవదీనా" పాట కి ఆమె నటన అమోఘం. ఆ వలపు, విరహం...ఓహ్ అద్భుతం !

    రిప్లయితొలగించండి
  2. విహారి గారు.. నాకు ఇష్టమైన నటుల్లో భానుమతి గారు ఒకరు.. మీరు చేస్తున్న ప్రయత్న౦ చాల మంచిది.. నేను ఆమె జీవితకథ కోసం వెతుకుతున్న నెట్ లో..
    మీకు తెలిస్తే చెప్పరూ? నాలో నేను...

    రిప్లయితొలగించండి
  3. Rajesh garu,

    I don't think you can get the e-version of 'naalo nenu'. Hard copies are available in all the leading book stores. You may place an order for the copy through online, I suppose.

    రిప్లయితొలగించండి