చిత్రమాలిక

2, నవంబర్ 2010, మంగళవారం

రామకృష్ణ ప్రేమగా మారిన "కృష్ణప్రేమ''

ఫేమస్‌ అండ్‌ స్టార్‌ కంబైన్సు వారు నిర్మించిన "కృష్ణప్రేమ'' 1943లో విడుదలయ్యింది. టి. సూర్యకుమారి, పి. భానుమతి, పి. శాంతకుమారి, అద్దంకి శ్రీరామ్మూర్తి నటించి ఎంతో కమ్మగా పాటలు పాడి ఈ చిత్రాన్ని ఒక సంగీతసభగా తీర్చిదిద్దారు. గాలిపెంచల, బలిజేపల్లి ఈ చిత్రానికి సంగీత సాహిత్యాలు. ఈ చిత్రానికి దర్శకుడు హెచ్‌.వి. బాబు. 1903లో జన్మించిన హెచ్‌.వి. బాబు బొంబాయికి చెందిన కోహినూర్‌ ఫిల్ము కంపెనీ ద్వారా నటుడుగా చిత్రరంగంలో ప్రవేశించారు. తర్వాత తన బావగారైన హెచ్‌.ఎం.రెడ్డి ద్వారా ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీలో అసిస్టెంటు డైరెక్టర్‌గా చేరారు. సినిమా ఆర్టిస్టుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సహనపరుడుగా ఆయనకు మంచి పేరుండేది. ఈ "కృష్ణప్రేమ'' చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో "కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమ''గా మారిందని జోక్‌ చేసేవారు.

మరికొంత సమాచారానికి కింద ఉన్న ఇమేజ్ మీద నొక్కండి.

1 కామెంట్‌: