చిత్రమాలిక

15, డిసెంబర్ 2010, బుధవారం

నాలో నేను - 1

భానుమతి గారు చెప్పిన కొన్ని సంగతులునాకు సినిమాలలోకి రావడం ఇష్టం లేదు. ఆ వృత్తి అంత గౌరవనీయమైనది కాదని అప్పట్లో నా అభిప్రాయం. నా గొంతు ఆంధ్రదేశమంతా వినిపించాలన్న తపనతొ మా నాన్నగారే సినిమాలకు ఒప్పుకున్నారు. మొదటి సినిమా వరవిక్రయం నాటికి నాకు పన్నెండేళ్ళు. చాలా బిడియంగా ఉండేదాన్ని. మగవాళ్ళెవరూ నన్ను ముట్టుకోకూడదని షరతు పెట్టారు మా నాన్నగారు.


నేను విశ్వనాథ కవిరాజు శిష్యురాలిని. పద్యం రాయటం ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన నాచేత మొదట రాయించిన కథ "మరచెంబు". అప్పుడు నాకు పధ్నాలుగో ఏడు నడుస్తోంది. పద్దెనిమిదో ఏటికల్లా గంటకు వంద పద్యాలు రాయగలిగేదాన్ని. ఆటవెలది, తేటగీతి, ఉత్పలమాల, చంపకమాల, ఇలా అన్నింటిలో పద్యాలు చెప్పేదాన్ని. మత్తేభం మాత్రం నాకు లొంగేది కాదు.


"భక్తిమాల" లో నాది నృత్యప్రధానమైన పాత్ర.వెంపటి పెదసత్యంగారు గురువు. అప్పుడు డ్యాన్సు అంటే ఇష్టముండేది కాదు.బిడియపడేదాన్ని. ఎలాగో కష్టపడి చేశాను. నేను ఆ చిత్రంలో ఏ భంగిమలో నిలబడ్డా కీళ్ళనొప్పులతో బాధపడుతున్నట్లు ఉండేది. ఆ స్టిల్ వేసి "కీళ్ళనొప్పుల భంగిమల భానుమతి" అని ఢంకా ఆచారి తన పత్రికలో ప్రచురించాడు కూడా.మరి కొన్ని సంగతులు తరువాతి టపాలో.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి