చిత్రమాలిక

16, ఫిబ్రవరి 2011, బుధవారం

నాలో నేను - 3



మావారు నన్ను రాణీ అని పిలిచేవారు. పెళ్ళైన రెండోరోజున అయనకు తల్లి తర్వాత తల్లిలాంటి మనపాక కమలమ్మగారితో ఏదో మాట్లాడుతున్నాను. మావారు నన్ను ఎలా పిలవాలో తెలయక, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారు పిలిచినట్టు 'ఏమేవ్' అని మెల్లగా పిలిచారు. అది విన్న కమలమ్మగారు ఏమిటా పిలుపంటూ మందలించేసరికి మావారు గతుక్కుమన్నారు. ఏదో తప్పు చేసినట్టు. ఆరోజు సాయంకాలం నా దగ్గరకొచ్చి రాణీ అని రహస్యంగా పిలిచారు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాను. నీ పేరు పెట్టి పిలవడం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను రాణీ అని పిలుస్తాను అన్నారు నన్ను దగ్గరకు తీసుకుంటూ. ఆ క్షణం నా జీవితంలో మరపురాని క్షణం.

ఎన్నో పుస్తకాలు, ప్రాచీన వేద ఉపనిషత్తులు చదివినా నాకు హాస్యమంటేనే ఇష్టం. మునిమానిక్యం నరసింహారావు, ధనికొండవారి రచనలు ఇష్టం. నాకు ఏడుపు గిట్టదు. చంద్రమతి పాత్రకు నన్ను తీసుకుందామని ఎవరో చక్రపాణిగారితో అంటే ఆయన భానుమతి ఏడిస్తే ఎవరు చూస్తారు. భానుమతి ఎవరినన్నా ఏడిపిస్తే చూస్తారుగానీ అని జోక్ చేశారు కూడా.

మరి కొన్ని సంగతులు తరువాతి టపాలో.

3 కామెంట్‌లు: